సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందని మానిఫెస్టోనీ 98.5 శాతం పూర్తి చేసిన పార్టీ YSRCP యే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఆదోని అసెంబ్లీ గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తాం అని కార్యకర్తలే మా బలం వారే మా కుటుంబానికి అండ అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ
సీఎం జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్నతో సాధ్యం అయిందని దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పాలన అందించారని అన్నారు. సీఎం జగన్ బీసీ ల పక్షపాతి అని దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని పదవులు బీసీ లకు ఇచ్చి వారికి వెన్ను దన్నుగా నిలిచారు సీఎం జగన్ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ శాంత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాజహర్ అహ్మద్, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కారపపరేషన్ డైరెక్టర్ మంజుల, మునిసిపల్ వైస్ చైర్మన్ లు గౌస్ అహ్మద్, నరసింహులు మరియు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, డైరెక్టర్ లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..