కర్నూలు జిల్లా హాలహార్వి మండలం చత్రగుడి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బొలెరో వాహనం టైరు పగిలి బొలెరో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. చిన్న మునియప్ప(65) ఇందు(12) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక బళ్లారిలో పెళ్లి చూపులకు వెళ్తుండగా చంద్రగుడి వద్ద టైరు పగిలి ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన ఆదోని గోనెగండ్లకు చెందినవారు.