ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

ఆదోని, సెప్టెంబర్ 15 (మంగళవారం):  ఆధునిక భారతదేశ మౌలిక వసతుల చరిత్రను తిరగేస్తే ప్రతి పేజీలోనూ సగర్వంగా కనిపించే పేరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన, కేవలం ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, దేశ దారిద్ర్యాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే తరిమికొట్టగలమని నమ్మిన దార్శనికుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15ను ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకోవడం ఆ మేధస్సుకు భారతదేశం ఇస్తున్న శాశ్వత నివాళి.

మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్న ఇంజనీర్స్ డే

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీమ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ‘ఇంజనీర్స్ డే’ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజనీర్స్ డే ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ. రామమూర్తి, డి.ఈ. రాజశేఖర్ రెడ్డి, ఏ.ఈ. భువన చంద్రా రెడ్డి, ఏ.ఈ. పావని, ఏ.ఈ. సురేష్ చంద్ర లను కమిషనర్ అభినందించారు. హమ్యూనిటీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది సావిత్రి, కృష్ణ, భద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్ & శానిటేషన్ విభాగాల సిబ్బంది, మేనేజర్, సూపర్వైజర్లు, ఆర్.ఐలు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్న ఇంజనీర్స్ డే