కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో శనివారం రోడ్డు భధ్రత , ట్రాఫిక్ నిబంధనల పై డ్రైవర్లకు  అవగాహన సదస్సు నిర్వహించారు.
ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ మీడియాతో మాట్లాడుతూ…
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ హేమలత ఆధ్వర్యంలో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.
వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించి,  సెల్‌ ఫోన్‌  మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదన్నారు. ప్రతి వాహనానికి రికార్డులు, ఇన్సూరెన్స్‌, డ్రైవర్స్‌ యూనిఫారం ధరించాలని, ఆటో లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని ఈరోజునే డ్రైవర్లు పాటించాలని డ్రైవర్స్‌ కు ట్రాఫిక్ సిఐ  అబ్దుల్ గౌస్ సూచించారు.

ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్
డ్రైవర్లతో మాట్లాడుతున్న ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *