కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామ శివారులో అహోబిలం (28) అనే వ్యక్తి ని గుర్తుతెలియను వ్యక్తులు దారుణంగా కత్తితో దాడిచేసి హత్య చేశారు. కత్తితో పలుచోట్ల దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గంగమ్మ , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మృతుడు అహోబిలం భార్య గంగమ్మ ఊరు కలపరి గ్రామానికి మాలపుణ్యం పండక్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుందని తెలిపారు.


