ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్, పిడిఎస్ఓ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని బీమాస్ రెస్టారెంట్లో విద్యార్థి సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పి ఎస్ డి ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాల యాజమాన్యలు స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డిపాజిట్ ఫీజ్ అని రకరకాల పేర్లతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏమి తెలియనట్లు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని డి.ఎస్.ఎఫ్, పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘా నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ప్రభుత్వనికి, విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో DSF, PDSO నాయకులు నవీన్ రాజ్ కుమార్ కిరణ్ పాల్గొన్నారు.