Connect with us

News

నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్  (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ సిఐ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో

వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO  సోమన్న వారి పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ వారి సిబ్బంది 16వ తేదీ గురువారం యెల్లమ్మ కొండలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక మహిళను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారు అయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటు సారాయి  ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఐదు ప్లాస్టిక్ డ్రమ్ములలో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ద్వంశం చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24116 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23655 క్యూసెక్కులు

Continue Reading

News

కర్రతో దాడి తలకు తీవ్ర గాయం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఉసేని అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉసేని తెలిపిన వివరాల మేరకు గ్రామంలో  ఘర్షణ పడుతున్నరని చూడడానికి వెళ్ళిన తనపై కర్రతో దాడి చేశారని  ఈ ఘర్షణకు తనకు ఎటువంటి సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని తెలిపారు.

హుసేని తమ్ముడు తెలిపిన వివరాల వీడియో
హుసేని తెలిపిన వివరాల వీడియో
Continue Reading

News

ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయండి.. సిపిఎం పార్టీ డిమాండ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి  (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు  గుర్తుచేశారు . కానీ  ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.
ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు బైచిగేరి క్రాస్ నుండి కపటి గ్రామం వరకు, ధనాపురం నుండి నాగనాతనహాళ్ళి వరకు వయా హోళగుంద వరకు రోడ్లు పూర్తి గుంతల మయమై వాహనాలు ప్రయాణికులు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రోడ్లను బాగు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని మండలం పాండవగల్ దగ్గర నుండి కుప్పగల్ క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి అడుగు నుండి రెండు అడుగుల వరకు కోతకు గురై వాహనాలు సైడ్ కు తీసుకోలేని పరిస్థితి ఉందని, ప్రస్తుతం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు సందర్భంగా తీవ్రమైన రద్దీ పెరిగిందని  దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రోడ్డుకి ఇరువైపులా గర్ల్స్ వేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరారు. సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, జే రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు భాష, అయ్యప్ప, పాండురంగ, హనుమంత్ రెడ్డి, మునిస్వామి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending