కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామ సర్పంచ్ జయరాం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యే కార్యాలయంలో వెల్లాల మధుసూదనశర్మ, సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథములో నడిడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందుకే మా చిన్నపెండేకల్లు గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సహాయ సహకారాలతో అబివృద్ధి చేసుకోవాలనే సంకల్పముతోనే భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు.

సర్పంచ్ జయరాంకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

ఈ కార్యక్రమములో వెల్లాల మధుసూదనశర్మ, సింహం నాగేంద్ర, కల్లుపోతుల సురేష్, దిబ్బనకల్లు రంగ, కౌన్సిలర్ చిన్న, నాగలాపురం సర్పంచ్ నాగిరెడ్డి, ధనాపురం సర్పంచ్ చంద్ర,గోవిందు, మహబూబ్ బాషా, శ్రీరాములు, నబీరసూల్, మొదలైన వారు పాల్గొన్నారు..

ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధికి పూలగుచ్చ అందజేస్తున్న జయరాం
హైదరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రూప్ ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *