కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి ఉన్న జింకను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు జింకను పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.