గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని  ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో  మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు. 

పూజ నిర్వహించి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లలో గుంతలు లేకుండా చేయాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమాన్ని చేపట్టిందని  అన్నారు.

పనులను ప్రారంభించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
గుంతలు మూసివేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *