కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హనుమాన్ నగర్ కు చెందిన నరసింహ అనే యువకుడు అనారోగ్యంతో గుండె సమస్య వల్ల మనస్తాపం చెంది రైలు no 11311 కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైలు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.