కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పావని (20) అనే వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పావని బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతురాలు పావని ఎనిమిది నెలల కూతురు కావ్య

బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి నగర్ కు చెందిన శ్రీనివాస్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో వాల్మీకి నగర్ కి చెందిన పావనికి 2021 లో శ్రీనివాస్ తో పెద్దల సమక్షంలో రెండవసారి వివాహం జరిగింది.  వీరిద్దరికీ 8 నెలల కావ్య అనే కూతురు ఉంది. పావని మృతికి అత్తింటి వేధింపులే కారణమని తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు కేసు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హాస్పిటల్ ఆవరణంలో బాధపడుతున్న బంధువులు
మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్న పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *