కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారని, వారిలో అమ్మాయిలు మరియు మహిళల సంఖ్య 90% ఉందని కావున విద్యార్థులు జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు.ఈ ర్యాలీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల నుండి ప్రారంభమై ఎమ్మిగనూరు సర్కిల్ వరకు సాగి అక్కడ మానవ హారంగా ఏర్పడి ప్రజలను చైతన్య వంతులను చేసే స్లొగన్స్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెయిత్ హోమ్ నిర్వాహకులు Dr. డేనియల్ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, nss అధికారులు జోనాథన్, ఉమాదేవి, వెంకట్రమి రెడ్డి, NCC అధికారులు కెప్టెన్ గోవిందు, లెఫ్టినెంట్ ఈరమ్మ, LGA సభ్యులు, ప్రేమ్ కుమార్, మనోజ్, సలోమీ, అనితా, ఉష విద్యార్థులు పాల్గొన్నారు.