కర్నూలు జిల్లా ఆదోని లో కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించరు. ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నరని అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులు బీఈడీ పూర్తయిన విద్యార్థులు ఈజీ పూర్తయిన విద్యార్థులు కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజు కళాశాలలో కడితేనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని DSF విద్యార్థి సంఘం గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.