కర్నూలు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం. కలకలం రేపుతున్న మైనర్ విద్యార్థిని మృతి. ప్రేమ పేరుతో జరిగిన మైనర్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతి రాలి తల్లిదండ్రులు.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని పురుగుల మందు తాగి అనుమానాస్పద మృతి చెందింది. అశ్విని తండ్రి విరేష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని. తన కూతురును ప్రేమించడం లేదని బలవంతంగా పురగుల మందు త్రాపి హత్య చేసాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అశ్విని ని చుట్టూ గత కొద్ది రోజులుగా సున్నీ అనే యువకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడని తెలియడంతో సన్ని కి పలుమార్లు హెచ్చరించమని తెలిపారు. శుక్రవారం పొలం పనులకు వెళ్లగా ఎవరు లేని తమ ఇంట్లోకి దూరి అమ్మాయి మీద బలవంతం చేసినందుకు పురుగుల మందు తాగినానని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పి చనిపోయిందని తండ్రి తెలిపాడు. మా అమ్మాయిని పురుగుల మందు తాపీ చంపినడా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియదని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.