కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షని రోడ్లపైకి నీరు చేరడంతో ప్రధాన రహదారుల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదురుగా రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మరియు తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారిలో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.