కర్నూలు జిల్లా దొడ్డనకేరి గ్రామంలో కే మునిస్వామి అధ్యక్షతన సిపిఎం పార్టీ శాఖ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి. రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామంలో ప్రధానంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు వంటి సమస్యలు ఉన్నాయని, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్థానిక సమస్యలపై పోరాడాలని మహాసభలో తీర్మానం చేశారు. దొడ్డనకేరి గ్రామంలో హోటల్ గిడ్డయ్య ఇంటి నుండి స్మశానం వరకు (నెమలికల్ రోడ్డుకు) సిసి రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని.. దొడ్డనకేరి నుండి సుల్తానాపురం వరకు రైతుల పొలాలకు వెళ్లే రస్తాకు గ్రావెల్ వేయాలని, దొడ్డనకేరి నుండి బల్లెకల్ వరకు రైతుల పొలాలకు వెళ్లే ప్రస్తుత గ్రావెల్ వేయాలని సిపిఎం పార్టీ దొడ్డనకేరి శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మహాసభలకు మండల నాయకులు నాగరాజు శాఖ సభ్యులు ఈరన్న, తిక్కన్న, కమల్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.