బీచ్ సెపక్ తక్రాలో భారతజట్టులో కురువ మధు కాంస్యం సాధించినందుకు సన్మానం : కర్నూలు జిల్లా కురువ సంఘం..
చైనా దేశంలోని కింగ్ డావోలో ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగిన ఆసియా బీచ్ సెపక్ తక్రాలో పురుఘల భారత జట్టు కాంస్యం పతాకాన్ని దక్కించుకుంది. భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కురువ మధుకు ఆదివారం శ్రీ భీరప్ప దేవాలయం ప్రాంగణంలో ఘనంగా కురువ సంఘం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, మాజీ అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ, ప్రదానకార్యదర్శి ఎం .కే . రంగస్వామి శ్రీలీలమ్మ పాల సుంకన్న కొత్తపల్లి దేవేంద్ర ధనుంజయ తిరుపాల్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా గడ్డం రామకృష్ణ గుడిసె శివన్న రంగస్వామి శ్రీలీలమ్మ మాట్లాడుతూ వరుసగా ప్రత్యర్థి దేశాల జట్లు పై విజయాలు సాధిస్తున్న మధుకు కర్నూలు జిల్లా కురవ సంఘం తరపున సన్మానం చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచిన కారణంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ కనపర్చి జట్టులో కురువ మధు స్థానం సంపాదించారు. చైనా దేశంలో జరిగిన ఆసియా పోటీల్లో మన రాష్ట్రం నుంచి పాల్గొని పథకాలతో తిరిగి వచ్చిన తరువాత కులస్థులు అందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *