కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా ప్రారంభం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ లో ఎర్పాటు వినాయక విగ్రహానికి తొలి పూజ చేసి లడ్డు వేలం పాట నిర్వహించారు మహేందర్ రెడ్డి 1 లక్ష 55 వేలకు పలికి స్వాధీనం చేసుకోగా హుండీని 2 లక్షల 10 వేల రూపాయలకు డాక్టర్ విజయ్ తీసుకొన్నారు. అనంతరం శోభయాత్రను ఎమ్మెల్యే పార్థసారథి ట్రాకర్ నడిపి ప్రారంభించరు. పట్టణంలోని ప్రధాన రహదారులగుండా శోభ యాత్రను నిర్వహించి ఎల్ ఎల్ సి వినాయక ఘాట్ వద్ద పూజలు నిర్వహించి వినాయకుని నిమజ్జనం చేశారు. గణేష్ నిమర్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.