కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత మార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారు.
తెల్లవారుజామున రోజువారి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో బహిర్భూమికి వెళ్లిన ప్రత్యర్థులు కాపుకాసి అంతమందించారు. శ్రీనివాసులు హత్యకు ప్రధాన కారణం తెలియ రాలేదు. అయితే గ్రామంలో పార్టీలకు అతీతంగా శ్రీనివాసులు హత్య జరిగిన ప్రాంతానికి అన్ని పార్టీలకు చెందిన గ్రామ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. డిఎస్పి శ్రీనివాసులు ఈ విషయంపై మాట్లాడుతూ గ్రామంలో రాజకీయ హత్యలు జరిగే పరిస్థితి లేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.