News
అందరికీ ఉపాధి పనులు కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆదోని మండలంలోని గ్రామాలలో 11 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, మండలంలో అందరికీ పనులు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఏపీఓ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత జూన్ నెల నుండి ఇప్పటి వరకు పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదని, దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కూలీ వేతనాలు అందకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్న సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలలో పనులు కల్పించకుండా, పనులు లేవు అనే పేరుతో నిలిపివేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు అందజేయాలని, ఉపాధి పనులు మండలంలో అందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఏపీవో మాట్లాడుతూ విత్తనాలు కూలీల అకౌంట్లో జమవుతున్నాయని, పనులు అందరికీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు హనుమంత్ రెడ్డి, ఉపాధి హామీ మేటీలు అనంత, k హుస్సేనీ, హనుమంత్ రెడ్డి, ఉపాధి కూలీలు గోవింద్ రెడ్డి, y హుస్సేనీ, ఆంజనేయ, నాగయ్య, నర్సిరెడ్డి, చిన్నన్న, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 13-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19603 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19449 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 12 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 31980 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 31775 క్యూసెక్కులు
-
News1 week ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News1 week ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News1 week ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News1 week ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News1 week ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News1 week ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
Business3 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News1 week ago
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్