పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెల్లెకల్ గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య అనే రైతు పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తి పొలంలో పనిచేస్తుండగా షార్ట్ కు గురై పడిపోవడంతో ఎవరు చూసుకోలేదని తరువాత మల్లయ్య కుమారుడు అక్కడికి వెళ్లి చూడడంతో కిందపడి ఉన్న వాళ్ళ నాన్నను చూసి కేకలు వేయడంతో చుట్టుపక్క పొలాల వారు వచ్చి చూసి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.