కర్నూలు జిల్లా అదోని ఇస్వీ బ్రిడ్జి సమీపంలో సెబ్ డిఎస్పీ వినోద్ కుమార్, సెబ్ సిఐ విన్నీ లత ఆధ్వర్యంలో వివిధ కేసులో పట్టుబడిన కర్ణాటక మధ్యాన్ని, నాటు సారాను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్, మే 2024 లో 37 కేసులో పట్టుబడ్డ 586 లీటర్ల మధ్యం ధ్వంసం చేస్తున్నామని వీటి విలువ సుమారు 3 లక్షల 50 వేల వరకు ఉంటుందని తెలిపారు. మొత్తం 37 కేసుల్లో ట్యాక్స్ కట్టని ఒక కేసులో 1.8 లీటర్లు, 8 నాటు సారా కేసుల్లో 108 లీటర్లు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుని వస్తుండగా పట్టుకున్న 28 కేసులు లో 475 లీటర్లు వున్నాయని తెలిపారు.
కర్ణాటక మధ్యాహ్నం ఉపాధిగా చేసుకుని అక్రమంగా తరలిస్తున్నారని వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి 40 వేల రూపాయలు జరిమానా కట్టించి వారిపై నిఘా పెట్టామని ఈ పనులు మానుకోకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిని పూర్తిగా అరికట్టలేమా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సెబ్ డి.ఎస్.పి వినోద్ కుమార్ సమాధానం ఇస్తూ 63 మంది సిబ్బంది 112 మంది అధికారులు 7 చెక్పోస్టు లు ఏర్పాటుచేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.