కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ కాలనీ సమీపంలోని లక్ష్మీ ఎస్టేట్ లో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 1,72,000 నగదు, 3 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధ్యతలు టీచర్ విరచంద్ర యాదవ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నరు.

పూర్తి వివరాలకై వీడియో

బాధితుడు టీచర్ చంద్ర తెలిపిన వివరాల మేరకు భార్య శ్వేత టీచర్ కావడంతో ఇద్దరు సెలవు పెట్టి భార్య శ్వేత తండ్రి అనరోగ్యంతో ఉండడంతో చూడడానికి ఆదివారం ఊరికి వెళ్లి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి మొత్తం చిందరమందరంగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఊరికి వెళ్లేటప్పుడు బంగారు ని లాకర్లు పెట్టి వెళ్లడంతో మిగిలిపోయామని ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ చీటీ ఎత్తిన డబ్బులు 1,40,000, భార్య దాచుకున్న 20000, పిల్లలు దాచుకున్న హుండీలో 12000 డబ్బులు సుమారు మూడు తులాలు ఉన్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు.

అల్మారా ను ఓపెన్ చేసిన దొంగ
డ్రాలు బీరువాలు ఓపెన్ చేసి పడేసిన దొంగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *