balanagireddy

_ ఏపీలో ఆటవిక పాలన
_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు
_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు.
_ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున పడేశారు.
_ ప్రభుత్వం తీరు పై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..
కర్నూలు జిల్లా మంత్రాలయం : ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాలను ఆశ చూపి అధికారంలోకి రాగానే అమలు చేయలేమంటు చెతులేతేశారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలంటీర్లను విమర్శించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తు శాంతి భద్రతల పై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *