కర్నూలు జిల్లా ఆదోనిలో యం.హెచ్.పి.యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో బుద్దిస్ట్ మైనారిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి హెచ్. రామలింగయ్య సభ్యత్వం పొందారు. హెచ్. రామలింగయ్యను శాలువా కప్పి సన్మానించి యం.హెచ్.పి.యస్ సంస్థ లోకి నాయకులు నూర్ అహ్మద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ యం హెచ్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో సంస్థ బలోపేతానికి నాయకులు నిరంతరం కృషి చేస్తామన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో జగన్ రెడ్డి, నాయకులు దోచుకున్న ప్రజా ధనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచి పెట్టాలని యం హెచ్ పి యస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి మరియు నాయకులు హసన్, వసీమ్ సాహెబ్, షకీల్, సద్దాం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *