కర్నూలు జిల్లా….. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువ ప్రమాణంలో నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉన్న పుష్కర ఘాట్లు, స్నానపు ఘూట్లు, గంగమ్మ దేవాలయం పూర్తి గా నీట మునిగాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుంగభద్ర నది లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నదిని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నది తీరం సందడిగా మారింది.