కర్నూలు జిల్లా ఆదోని పరిదిలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెబ్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 24 వాహనాలకు ₹ 2 లక్షల 13 వేల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు.
సిఐ విన్నీ లత తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐ.పి.యస్. మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్.నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండ్ ఎస్.రవికుమార్ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 24 వాహనాలను బహిరంగ వేలం వేయటం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి 213000 వేల ఆదాయం వచ్చిందని మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా లో జమ చేశామని తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమంలో సబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ ఎస్. రవికుమార్, ఎస్ఐ ఇస్మాయిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.