కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత 2006 సంవత్సరం నుండి ఇప్పటివరకు 18 సంవత్సరాలుగా పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ పనుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతి, అక్రమాలు లేకుండా నీతి, నిజాయితీగా,మన, తన తారతమ్యం లేకుండా గ్రామంలో అందరికీ పనులు కల్పిస్తూ ఉందని అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం వల్ల గ్రామంలో పని నిలిచిపోయి ఉపాధి కూలీలకు నష్టం కలుగుతుందని ఆమెను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టిడిపి, ఒకసారి వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎవరు తొలగించలేదని ప్రస్తుతం ఉపాధి అధికారులు అధికార పార్టీ ఒత్తిడి మేరకు తొలగించాలని చూడడం సరికాదని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి ఎంపీడీవో మరియు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి ఏపీఓ అధికారులు కు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఉపాధి మేటిలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశం అని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ సమస్యను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు, రామాంజనేయులు, సిఐటియు నాయకులు పాండురంగ, ఉపాధి హామీ మేటీలు కే హుస్సేని, అనంత ఆంజనేయ, హనుమంత్ రెడ్డి ఉపాధి హామీ కూలీలు y హుస్సేనీ, కొండయ్య, రమేష్ హనుమంత రెడ్డి, భీమయ్య రాము, మల్లికార్జున, గోవింద్ రెడ్డి, చిన్నన్న,రామాంజనేయ, పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *