కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజి పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మెడికల్ కాలేజీ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మార్వో హసీనా అధికారులు తలా ఒక మొక్కని నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ రెండు బ్లాగులు పూర్తిస్థాయి చేరుకున్నాయని తెలిపారు. వచ్చే సంవత్సరం అకాడమీ ఇయర్ లోపు పూర్తి చేస్తామని 33 కోట్లతో మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.