తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన కురువ కులస్తులకు నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి. లకు న్యాయం చేయాలని ఆదివారం విజయవాడలో రాష్ట్ర బి.సి. సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మ నివాసంలో కురువ సంఘం నాయకులు శాలువా కప్పి మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం. రాష్ట్రంలో కురువ కులస్తులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగు న్యాయం చేయాలని కురువ సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సవితమ్మ నామినేటెడ్ పదవుల విషయం లో బి.సి. లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని కురువ సంఘ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, కర్నూలు జిల్లా కురవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు టి .శ్రీలీలమ్మ, టి. విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ ,కొత్తపల్లి దేవేంద్ర, తవుడు శ్రీనివాసులు,.కే . వెంకటేశ్వర్లు, కే .నాగశేషులు ,కే .మహేష్ తదితరులు పాల్గొన్నారు.