కర్నూలు జిల్లా ఆదోని లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎన్నికల అనంతరం హింసను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఖండించారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షణభంగురమైన ఈ జీవితాన్ని అంకితం చేయాలి తప్ప కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాల కోసం కాదు అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష నాయకులు సంయమనం పాటిస్తూ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలని పిలుపునిచరు. పోలీసు శాఖ కూడా నిఘా విభాగాల సమాచారం ఆధారంగా గొడవపడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికలు ముగిసినందున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక ప్రతి ఒక్కరూ రాజకీయాలకు కతీతంగా పని చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విన్నవించారు.