కర్నూలు జిల్లా కోసిగి (మం) పెద్ద భుంపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో పోలీసుల వీరంగం సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కోసిగి పోలీసుల దాష్టీకం.
బుధవారం తెల్లవారుజామున మోహర్రం వేడుకల్లో రవి అలియాస్ రాజు (20) పై అకారణంగా పోలీసులు దాడి చేసి చితకబాదారని అవమానం భరించలేక పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నానికి పలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు కోసిగి లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలింపు.