కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు కారణమైన పశువుల యజమాను లు బాధ్యత రహితంగా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు పశువుల యజమానులకు అనేకసార్లు సమావేశములు ఏర్పాటు చేసి వారి పశువులను రోడ్లు మీదకు వదలకుండా జాగ్రత్తలు తీసుకొనవలని హెచ్చరించిన పశువుల యజమానులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పశువులను యధేచ్చగా రోడ్ల మీదకు వదలటం జవాబుదారీతనం లేకపోవడం వలన యాక్సిడెంట్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం, ఆదోని పురపాలక సంఘము యంత్రాంగం ఆదేశాముల మేరకు పశువులు రోడ్లపై కనబడితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా పశువులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులపై పశువుల యజమానులకు ఎటువంటి హక్కులు వుండవని తెలిపారు. పశువుల యజమానులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.