మంత్రి కురువ సవితమ్మ కు శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా కురువ మహిళా అధ్యక్షురాలు శ్రీలీల………
శనివారం పెనుగొండ లో బి .సి .సంక్షేమ శాఖ మంత్రి కురువ సవితమ్మను వారి నివాసంలో కర్నూలు జిల్లా కురువ మహిళా సంఘము అధ్యక్షురాలు శ్రీలీల మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శ్రీలీల మంత్రి తో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ నందవరం మండలం జొహరాపురం గ్రామంలో అగ్రవర్ణాల వారు పొలం తగాదా విషయం లో మహిళలని చూడకుండా కురువ సరస్వతమ్మ మరియు కురువ రాములమ్మ లపై వేటకొడవళ్లు, రాడ్లతో దాడి చేసారని తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో కురువ సంఘము మాజీ గౌరవ అధ్యక్షులు స్వర్గీయ డా .టి పుల్లన్న గారి సతీమణి టి. విజయలక్ష్మి, అల్లుడు గంగకిరణ్, డా. శ్రీశైలజ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.