కర్నూలు జిల్లా ఆదోని జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 సందర్భంగా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్, భీమా సర్కిల్, గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా మరల ఆర్టీసీ బస్టాండ్ వరకు “ఆటో ర్యాలీ” నిర్వహించరు.

ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించటంలో ముఖ్య పాత్ర పోషించాలని, అలాగే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని వారికి తెలియజేశారు. ఆటో ర్యాలీలో ట్రాఫిక్ సిఐ, టూ టౌన్ మరియు రూరల్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

