భద్రతపై అవగాహన  బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసుల

కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం జాతీయ రహదారి మాసోస్తవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పిసిఆర్, ఆర్ట్స్ కాలేజీ, బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ , ఆర్టీసీ బస్టాండ్ మొదలగు సర్కిల్ డీఎస్పీ హేమలత, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీ ప్రారంభిస్తున్న ఫోటో

ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు “జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆదోని సబ్ డివిజన్ పోలీసు సిబ్బందితో   హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి విలువైనది మన ప్రాణము అని, ఆ ప్రాణాన్ని మనము కాపాడుకోవడానికి తప్పనిసరిగా టు వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని మరియు వేగం కన్నా ప్రాణం మిన్న అని వాహనాలు నడిపేటప్పుడు ఇంటిదగ్గర మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుంటారని, వాళ్లకు మనమే ఆధారం అని గుర్తించుకొని,  ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా  నివారించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీ ప్రారంభిస్తున్న ఫోటో

ఈ ర్యాలీలో ట్రాఫిక్ సిఐ, టూ టౌన్, 3 టౌన్, రూరల్ సిఐలు, ఎస్సైలు, ఆదోని సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న డిఎస్పీ హేమలత
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పి సిఐలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version