పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం.. సబ్ కలెక్టర్

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీ సెబ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న సబ్ కలెక్టర్


ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం. వారు ఎలాంటి సాహసాలకైనా వెనుకడుగు వేయరు. కానీ కొంతమంది విద్యార్థు డ్రగ్స్‌ వంటివి సరదాగా అలవాటై మత్తు బానిసలవుతారు. దానివల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు.

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు


ట్రైన్ డిఎస్పి ధీరజ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందజేస్తే మత్తు పదార్థాల నివారణ పునరావాస కేంద్రాలకు అధికారికంగా తాము తరలిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడకం జరుగుతున్నట్లయితే సమాచారం తెలియజేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు అధికారు


అనంతరం విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేకంపై ప్రతిజ్ఞ చేయించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి జండా ఊపి ర్యాలీ ప్రారంభించి జిమ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైన్ డిఎస్పి ధీరజ్, ప్రిన్సిపల్ మురళీ మోహన్, సెబ్ సీఐ విన్ని లత, సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, తేజ మూర్తి, నిరంజన్ రెడ్డి, మంజునాథ్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version