రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్న,పేద రైతులు తాము పెంచుకుంటున్న పాడి పశువులకు సరైన వసతి కల్పించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోంది. రెండు పశువులకు రూ.లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30 లక్షలు యూనిట్‌కు మంజూరు చేస్తోంది. యూనిట్ ఖర్చు మొత్తంలో 10శాతం రైతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్మును ఉపాధి హామీ పథకం ద్వారా విడుదల చేస్తోంది. రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. గ్రామాల్లో పశువైద్యాధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.