ఆదోని క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల జూలై 29 నుండి ఆగస్టు 8 వరకు కడపలో జరగనున్న అండర్-19 సౌత్ జోన్ మ్యాచ్‌లకు ఆదోనికి చెందిన మల్లికార్జున ఎంపికయ్యాడు. అలాగే, అండర్-15 బాలికల సౌత్ జోన్ జట్టుకు వై. మేఘనా రెడ్డి, ఎన్. లావణ్య ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్లకు ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విట్టా రమేష్, ఉపాధ్యక్షులు ముజీబ్, కార్యదర్శి వెంకటేష్, సభ్యులు జె.ఎం. బాషా, వెంకటేష్ బాబు, కోచ్ బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే మ్యాచ్‌లలో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూ సౌత్ జోన్ స్థాయికి ఎంపికయ్యేలా సహకరించిన కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) కు, కోచ్‌లకు ఆదోని క్రికెట్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా, ఆటగాళ్ల శిక్షణకు, ఎంపికలకు అవసరమైన గ్రౌండ్ సదుపాయాన్ని నిరంతరం అందిస్తున్న ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యాజమాన్యానికి అధ్యక్షులు విట్టా రమేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *