జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని తలారి నిఖిత రావి ఆకుపై దేశ సైనికులు త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టు నిఖిత తెలిపింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది. చిత్రాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థిని తలారి నిఖిత ను అభినందించారు.