కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్ లో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల గెలుపొందిన విద్యార్థులకు మరియు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో ఉత్తమంగా ప్రదర్శన చూపిన బిఎల్ఓలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఎన్నికల ఉప తాసిల్దార్ గాయత్రి, ఉప తహశీల్దార్ వలి భాష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



