Day: December 24, 2024

హైందవ శంఖారావం పై డిజిపితో కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి

విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ […]

గ్రామంలో జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి ఆదోని ఎమ్మార్వో

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు. ఈ పర్యటనలో పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఖాసిం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 23-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7220/- రూపాయలు కనిష్ట ధర ₹. 5408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5193/- రూపాయలు కనిష్ట ధర ₹. 3469/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5678/- రూపాయలు కనిష్ట ధర ₹.3333/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4632/- రూపాయలు కనిష్ట ధర ₹.4632/- […]

Back To Top