బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థి దశలోనే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మేము చదివే రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఉండేవి కాదు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా రంగానికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం తో ప్రపంచం తో పోటీ చేసే విధంగా మన విద్యార్థులు కావాలని ఇంగ్లీష్ మీడియాని ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ… విద్యా వైద్య రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టారన్నారు. సాధారణ విద్యార్థులకు కూడా విదేశీ విద్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు. మరియు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలు ఉన్న పరిమితిని 25 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. జగనన్న సివిల్ ప్రోత్సాహం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికమైన సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఈఓ శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాబ్ లను చూపిస్తున్న విద్యార్థులు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థినీలు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *