కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు సర్కిల్లో సోమవారం రోజు హత్యకు గురైన శంకర్ మృతదేహంతో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హత్య చేసిన నలుగురు రైస్ మిల్ వ్యాపారి జనార్దన్ రెడ్డి, అలసంద గుత్తి గ్రామానికి చెందిన జయరామి రెడ్డి, కందుకూరు గ్రామానికి చెందిన రామలింగడు, ఆటో డ్రైవర్ రామకృష్ణ నిందితులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పోలీసులు జోక్యం చేసుకొని నిందితులను పట్టుకుని కోర్టుకు హాజరు పరిచే శిక్ష పడేలా చూస్తామని చెప్పడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు శాంతించారు మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించారు.



