కర్నూలు జిల్లా ఆదోని 20వ వార్డు మండగిరి ఎస్సీ కాలనీలో బండి రాముడనే వ్యక్తి ఆనరోగ్యంతో మృతి చెందారని వరిది పేద కుటుంబం అని వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించి బండి రాముడు కుటుంబానికి మట్టి ఖర్చుల (అంత్యక్రియల) నిమిత్తం 10,000 రూపాయల (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మృతుడి కుటుంబ సభ్యులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ఇంచార్జ్ మొండి మల్లయ్య మాజీ కౌన్సిలర్ మధుబాబు, గంజలయ్య, మల్లికార్జున టైలర్, బీరువాలు హనుమంతు, ఉమేష్, శేఖర్ టైలర్, హోటల్ నరసింహులు. మణి బాబు పాల్గొన్నారు.

