బీసీ వసతి గృహాల్లో ఆర్డీవో అరుణ దేవి ఆకస్మిక తనిఖీ
ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా […]