ఆదోని: పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదోని – మాధవరం రోడ్డుపై పాండవగల్లు వద్ద మంగళవారం నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా పాండవగల్ పెద్ద చెరువు సమస్య హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి […]
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 28.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 28 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1608.19 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 34.148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది […]