ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి అయ్యిందన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని – కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన పాండవగల్లు శివరాజ్ (20) బుధవారం (జూలై 29) రాత్రి ఇసవి-కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య కేఎమ్ నెంబర్ 504/23-21 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి […]
కుప్పగల్లులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి భూమి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్మశాన స్థలం లేక దళితులు తీవ్ర […]
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
హోస్పేట: 30.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 30 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1609.21 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 36.043 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది […]