హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు, బ్రాహ్మణుడి మెడలో ఉన్న యజ్ఞోపవీతం (జంధ్యం ) యొక్క పవిత్రతను తెలియచెప్పే ఇతివృత్తముతో పిసి ఆనంద్ గారి దర్శకత్వములో కొల్లూరి రవికిరణ్ నిర్మించిన లఘు చిత్రంతరం (ది జనరేషన్) భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లె గ్రామ పరిసర ప్రదేశాలతో పాటుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోచంపల్లి రమణారావు గారి గృహములో మూడు రోజులలో షూటింగ్ పూర్తి చేశారు.

ఈ లఘు చిత్రములో దుర్భాకుల సాయి కథానాయకుడితో పాటుగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ, రవికిరణ్, శ్రీనిధిరఘు, కలసపాటి లక్ష్మీ నారాయణ, శ్రవంతి, హర్షిత, కౌస్తుబ్, రమణ మొదలైన వారు నటించారు. ఈ సినిమా పూజకార్యక్రమములో జబ్లిక్ పల్లె సర్పంచ్ లచ్ఛిలింగస్వామి, ఉప సర్పంచ్ ఆర్ల లింగుస్వామి, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

